చత్తీస్ ఘడ్ ఆడవుల్లో సాయుధ నక్సలైట్లకు పోలీసులకు మద్యన సాయుధ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా నక్సలైట్లు, పోలీసులు చనిపోతున్నారు. ప్రతికార చర్యలతో దంతెవాడ అడవి ప్రాంతం అట్టుడికిపోతుంది. కాగా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బాసరగూడెం- సర్కెగూడెంల మద్యన మావోయిస్టులు మందుపాతర పేల్చిన సంఘటనలో ఇరువురు సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. కాగా ఇదే ప్రాంతంలో పోలీసులు నక్సలైట్లకు మద్యన జరుగుతున్న ఘర్షణలో అమాయకులైన గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: